- కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
- కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్
- జూలుడుపాడు పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.. రికార్డుల పరిశీలన
కాకతీయ, జూలూరుపాడు : కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి,పెండింగ్ కేసుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ,గ్రామాల్లో పెట్రోలింగ్,డయల్ 100 ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలన్నారు. కేసులకు సంబంధించిన విషయాలను సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైబాధావత్ రవి, చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ,అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ లను కేసులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు ప్రజలకు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


