- కాజీపేట పాసింజర్ ట్రైన్ ను పునరుద్ధరించాలి
- రైల్వే బోర్డు మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి
- రైల్వే డిఆర్ఎంకు సమస్యలపై వినతిపత్రం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాచలం రోడ్డు కొత్తగూడెం నుంచి కలియుగ దైవంగా వెరసెలుతున్న తిరుపతి పుణ్యక్షేత్రానికి స్పెషల్ ట్రైన్ రైల్వే అధికారులు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నడిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డి ఆర్ యు సి సి మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి కోరారు. భద్రాచలం దైవదర్శనం కార్యక్రమానికి కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు స్పెషల్ ట్రైన్ లో వచ్చిన సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాల కృష్ణయ్యని శుక్రవారం సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డి ఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి కలిసి కొత్తగూడెం ప్రాంత రైల్వే సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. కరోనాలో రద్దు చేసిన డోర్నకల్ కాజీపేట ప్యాసింజర్ రైలును తక్షణం పునరుద్ధరణ చేసిన నడిపించాలని కోరారు. సింగరేణి ట్రైన్ కు గతంలో లాగా బోగీలుతొనడపాలని, సూపర్ ఫాస్ట్ ట్రైన్ కు, కాకతీయ ట్రైన్ కు అదనంగా రెండు ఏసీ బోగీలు మరో రెండు స్లీపర్ కోచ్ భోగిలు ఏర్పాటు చేయాలని కోరారు. డోర్నకల్ టు కొత్తగూడెం వరకు డబల్ రైల్వే లైన్ త్వరగా చేయాలని అదేవిధంగా అటుకోవూరు రైల్వే లైన్ పనులు ఎటువైపు భద్రాచలం మీదుగా చత్తీస్గడ్ టు కిరణ్ డోల్ వరకు రైల్వే లైను ఏర్పాటు చేసి కొత్తగూడెం రైల్వే జంక్షన్ గా ఏర్పాటు చేయాలని తద్వారా కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో భద్రాచలం రోడ్ రైల్వే ఏరియా ఆఫీసర్, రైల్వే పోలీస్ అధికారులు, రైల్వే ఇన్స్పెక్టర్, స్టేషన్ మేనేజర్, తదితర అధికారులు పాల్గొన్నారు.


