- బీసీలపై రేవంత్ కపట ప్రేమ ..
- లక్ష్మిదేవిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు
కాకతీయ, కొత్తగూడెం : అమలుకానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఘోరంగా ఓడిపోతామన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ను తెరమీదకు తెచ్చిందని లక్ష్మిదేవిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిట్టెం కొట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదని హైకోర్టు స్టే విధించడం ద్వారా మరోసారి నిరూపితం అయిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదరాబాదరాగా చెల్లని జీవో తెచ్చి తామేదో బీసీ సామాజికవర్గాన్ని ఉద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసి చట్టం ముందు బోర్లా పడిందన్నారు. తెలంగాణ సమాజం ఎలక్షన్లు జరగవని ముందే ఊహించిందని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ నకిలీ జీవో ద్వారా ఎలక్షన్ నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా చేసిందని, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బీసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే డ్రామాలు ఆపి ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్లు సజావుగా జరిగేలా ఆలోచన చేయాలని, రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే బిఆర్ఎస్ చూస్తూ పార్టీ ఊరుకోదని, ప్రజా కోర్టులో శిక్ష తప్పదని స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాకతప్పదని హెచ్చరించారు.


