- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
కాకతీయ, బయ్యారం : సీపీఐలో వామపక్ష భావజాలంతో పేదల అభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడిన మహనీయుడని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి విజయసారథి అన్నారు. పుసులూరి రంగన్న సీపీఐ మండల కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎనలేని సేవ చేశారన్నారు. రంగన్న సంస్మరణ సభ గురువారం కమ్మ ఫంక్షన్ హాల్ లో సీపీఐ మండల కార్యదర్శి సారక్క శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు , సీపీఐ ఎంఎల్ పార్టీ మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నరసయ్య పాల్గొని మాట్లాడారు.
సమాజంలో అందరి మన్నలను పొందారని, ఒకే పార్టీలో ఉంటూ పార్టీని వీడకుండా పలువురికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. నిత్యం పేద ప్రజల బాగోగుల కోసం తపించే ఆయన భార్య ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మృతి చెందడం, అది మరిచిపోక ముందే రంగన్నను కూడా కోల్పోవడం విచారకరమన్నారు. వారులేని లోటు పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు శ్రీలత, శ్రీలక్ష్మిలను ఓదార్చి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సంతాప సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, సీపీఎం మండల కార్యదర్శి నంబూరి మధు జిల్లా కార్యవర్గ సభ్యులు మండ రాజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభాకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


