కాకతీయ, కెరీర్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ నియంత్రణ సంస్థ అయిన సెబీ వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 110 పోస్టులు భర్తీ చేయనుంది.
ఆర్థిక రంగం, లా, టెక్నాలజీ, ఇంజినీరింగ్ తదితర విద్యార్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో సెబీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది.
పోస్టుల వివరాలు (Stream-wise Vacancies):
General Stream: 56 పోస్టులు
Legal Stream: 20 పోస్టులు
Information Technology (IT): 22 పోస్టులు
Electrical Engineering: 2 పోస్టులు
Civil Engineering: 3 పోస్టులు
Research: 4 పోస్టులు
Official Language: 3 పోస్టులు
మొత్తం 110 పోస్టులు ఈ నియామక నోటిఫికేషన్ కింద ఉన్నాయి.
అర్హతలు (Eligibility Criteria):
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు సంబంధిత విభాగంలో క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి:
General Stream: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్, లేదా CA/CFA/CS/CMA అర్హతలు.
Legal Stream: ఎల్ఎల్బీ (LLB) డిగ్రీ కలిగినవారు.
Information Technology: BE/B.Tech (IT, CS, EC) లేదా MCA పూర్తిచేసిన అభ్యర్థులు.
Electrical & Civil Engineering: సంబంధిత బ్రాంచ్‌లో BE/B.Tech ఉత్తీర్ణత అవసరం.
Research: సంబంధిత సబ్జెక్ట్‌లో Post-Graduation లేదా M.Phil/Ph.D.
Official Language: హిందీ లేదా సంస్కృతంలో పీజీతో పాటు ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు రకం: ఆన్లైన్
అధికారిక వెబ్సైట్: www.sebi.gov.in
దరఖాస్తు ప్రారంభ, ముగింపు తేదీలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రకటిస్తారు.
ఎంపిక విధానం (Selection Process):
సెబీ నియామక ప్రక్రియలో సాధారణంగా మూడు దశలు ఉంటాయి:
Phase-I (Preliminary Exam) – ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్
Phase-II (Mains Exam) – డిస్క్రిప్టివ్ & ఆబ్జెక్టివ్ పేపర్స్
Interview (Phase-III) – ఫైనల్ మెరిట్ ఆధారంగా
జీతం (Salary & Benefits):
సెబీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ప్రాథమిక వేతనం రూ.44,500/- నుండి ప్రారంభమవుతుంది. DA, HRA, గ్రేడ్ పేగా కలిపి మొత్తం సాలరీ నెలకు రూ.1,40,000/- వరకు ఉంటుంది. అదనంగా పలు అలవెన్సులు, మెడికల్, లీవ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.


