- క్రీడలతోనే బంగారు భవిష్యత్తు
- కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: క్రీడల ద్వారా బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో బుధవారం ఏర్పాటుచేసిన 69వ ఎస్ జిఎఫ్ జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని విజేతలైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అదేవిధంగా ప్రతీ క్రీడాకారుడు క్రీడల ద్వారానే బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏ విధమైన సహాయానికైనా డీవైఎస్ఓ ద్వారా తనను సంప్రదించాలని తెలిపారు. బాల బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, తరువాత ఉమ్మడి జిల్లా జట్టుతో కలిపి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారని ఎస్ జిఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, డిసిఈబి సెక్రెటరీ నీరజ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, యుగంధర్, స్టెల్లా, కవిత, వీరన్న, కృష్ణ, పామర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


