కాకతీయ, పినపాక : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పేద విద్యార్థులకు సహాయం అందిస్తున్న దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల హెడ్మాస్టర్ నాగయ్య అన్నారు. బుధవారం పాఠశాల పూర్వ విద్యార్థి మారంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు ఐడి కార్డులు, బెల్టులు అందజేశారన్నారు. చదువుకున్న పాఠశాలపై ప్రేమతో ప్రయివేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.20వేలు విలువ చేసే ఐడి కార్డులను, బెల్ట్ లను అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వీరన్న, సిబ్బంది పాల్గొన్నారు.


