- మణుగూరు ఏటీసీని సందర్శించిన జిల్లా కలెక్టర్
కాకతీయ, మణుగూరు: మణుగూరు ప్రభుత్వ ఐటిఐలో ప్రారంభించిన ఏటీసీ కేంద్రాన్ని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ఏటీసీలో పెండింగ్ పనుల గురించి, వాటి పురోగతి విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. నేర్చుకున్న ప్రతిదీ మన నిత్య జీవితంలో ఉపయోగపడేలాతయారు చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపాల్ జి.రవి, సూపరిటెండెంట్ టిఎన్ జ్యోతి రాణి, ఏటీవోలు శ్రీనివాసరావు, జివి కృష్ణారావు, నర్సయ్య, వేణుగోపాల్, సిబ్బంది పూర్ణచందర్రావు, సూనాథ్ అశోక్, శ్రావణి, చందు తదితరులు పాల్గొన్నారు.


