కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉణ్న టారిఫ్స్ విధించే శక్తి వల్లే ప్రపంచ యుద్ధాలను ఆపగలిగాను అంటూ పేర్కొన్నారు. ఆ శక్తే లేకుంటే ప్రస్తుతం ప్రపంచంలో కనీసం నాలుగు దేశాల మధ్య భీకర యుద్ధాలు జరిగేవని వివరించారు. పలు దేశాలపై టారిఫ్స్ విధించడం వల్ల ప్రపంచంలో శాంతి నెలకొల్పడంతో పాటు అమెరికాకు భారీ మొత్తంలో డబ్బు సమకూరుతోందని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, పాక్ ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. టారిఫ్స్ లు విధిస్తామని హెచ్చరించడం వల్ల వ్యాపార ఒప్పందాల పేరుతో బెదిరించి రెండు దేశాలను యుద్ధ విరమణకు ఒప్పించినట్లు తెలిపారు. అణ్వాయుధ దేశాలపై భారత్, పాక్ మధ్య యుద్ధం మొదలయ్యాక కనీసం 7 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని ట్రంప్ తెలిపారు. దీంతో తాను కల్పించుకుని రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగే విధంగా చేశానని తెలిపారు. అయితే యుద్ధం విరమించేందుకు భారత్, పాకిస్తాలను ఏమని బెదిరించానన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు.


