కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రూమర్స్ కు చెక్ పెట్టారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ సంబంధం చాలా రోజులుగా సినీ ప్రపంచంలో వైరల్ అవుతోంది. వారిద్దరి మధ్య ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా, వీరి సోషల్ మీడియా ఫోటోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండేవి. ఏ చిన్న సందర్బం అయినా సరే.. వీరు ఒకే చోట లేదా వేర్వేరు పోస్టులు పెట్టడం ద్వారా వీరిద్దరి మధ్య లవ్ కొనసాగుతున్నట్లు అభిమానులు ఊహించుకునేవారు.
అయితే ఈ రూమర్స్ చెక్ పెడుతూ.. తాజాగా, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ జరిగింది. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక సుసంపన్నమైంది. వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, ఫేమస్ డెస్టినేషన్ ప్లేస్‌లో పెళ్లి చేసుకునే ప్లాన్ చేశారట. వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. ప్రత్యేకంగా, గీత గోవిందం సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై ఫ్యాన్స్ అభిమానంతో చూస్తూ, అప్పటినుంచి వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఆ తర్వాత కూడా వీరి ప్రేమ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. కానీ వీరి సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు అభిమానులకు లవ్ స్టోరీకి సాక్ష్యం అయ్యాయి. ఎప్పటికీ గోప్యంగా ఉన్నా, ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత క్యూట్ కపుల్ ఒకటిగా రాబోతున్నారు అని ఫ్యాన్స్ ఫుల్ ఆనందంలో ఉన్నారు. త్వరలోనే మూడుముళ్ల బంధంలో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


