కాకతీయ, స్పోర్స్ట్ డెస్క్: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి విడాకులకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన తర్వాత షోయబ్ పాకిస్తాన్ కు చెందిన నటి సనా జావెద్ ను గత ఏడాది మూడో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన ఏడాదికే సనాతో తన వివాహ బంధానికి స్వస్తి పలికేందుకు షోయబ్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా షోయబ్ మాలిక్ తన వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్ వలె మీడియా దృష్టిలో ఎప్పుడూ ఉంది. మొదట 2002లో హైదరాబాదుకి చెందిన అయేషా సిద్దిఖీతో పెళ్లి చేసుకున్నాడు. అయితే, 2010లో షోయబ్, అయేషాతో బంధాన్ని ముగించి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం హైదరాబాదులో ఘనంగా జరిగింది. తర్వాత,పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్లో వలీమా వేడుక జరుపుకుని పాకిస్తానీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
షోయబ్ మాలిక్–సానియా మీర్జా జంటకు 2018లో ఓ కుమారుడు ఇజాన్ జన్మించాడు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత, సానియా షోయబ్ మాలిక్ ప్రేమ సంబంధాల్లో అసంతృప్తి వ్యక్తం చేసి, ‘ఖులా (Khula)’ అనే షరియా చట్ట ప్రక్రియ ద్వారా విడాకులు తీసుకుంది. ఈ ప్రక్రియలో సానియా తన కుమారుడిని షోయబ్‌కు అప్పగించగా, అప్పట్లో సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
అందుకే, షోయబ్ మాలిక్ మూడోసారి వివాహానికి ముందుకు వెళ్లి అందరికీ షాక్ ఇచ్చాడు. గత ఏడాది జనవరి 22న పాకిస్తాన్ నటి సనా జావెద్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం మాలిక్‌కు మూడవది, సనా జావెద్‌కు రెండోది. ఇప్పటికే సోషల్ మీడియా వార్తల్లో, షోయబ్ మాలిక్ మూడోసారి విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


