- పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలు పాటించాలి
- తహసీల్దార్ గోపాలకృష్ణ.
కాకతీయ, పినపాక: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పినపాక తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు . సెప్టెంబర్ 29 నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారానికి 3 రోజులు ముందుగానే అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా కోడ్ ఉల్లంఘించినట్లు, డబ్బులు పంచినట్లు సమాచారముంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


