కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఇటీవల మంగళగిరిలో జరిగిన 36వ సౌత్ జోన్ నేషనల్ అథెటిక్స్ లో 800 మీటర్స్ రన్నింగ్ లో జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించిన ఎస్.కె అఫ్రీన్ (ఖమ్మం జిల్లా హోంగార్డు ఆఫీసర్ ఎస్కే రహీం కుమార్తె)ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభిందించారు. కోచ్ యం.డి గౌస్ ఆధ్వర్యంలో సెప్టెంరులో జరిగిన సౌత్ జోన్ రాష్ట్రస్థాయిలో 800 మీటర్ పరుగు పందెంలో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్, 4×4 రిలే లో రెండో స్థానం సిల్వర్ మెడల్, జూనియర్ నేషనల్ స్టేట్ మిట్ లో 800 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ ఐ సురేష్, హోగార్డ్ అసోసియేషన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


