ఏలూరు/ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం – గ్రామ సచివాలయం వద్ద బుధవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పూలమాలలు, శాలువాలు కప్పి, పండ్లను అందించి మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. లు పట్ల సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యం, వారి హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేయడానికి అక్టోబరు 01వ తేదీన వృద్ధులు దినోత్సవం జరుపు కుంటున్నామని తెలిపారు. వృద్ధులకు గౌరవం, సంరక్షణ, అనుభవాలను గుర్తించడం, వృద్ధాప్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అన్నారు.
నేటికాలంలో వృద్ధులకు సరైన సంరక్షణ, ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కొన్ని ఏళ్ళు తర్వాత మనం కూడా వృద్ధాప్య దశకు వస్తామని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవడంతో చాలా మంది వృద్ధులు ఒంటరితనం, ఆశ్రయానికి గురవుతున్నారని అన్నారు. వారికి బాసటగా నిలబడి, సమాజంలో గౌరవంగా జీవించేలా చూడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వృద్ధులకు ఆర్థిక భద్రత, గౌరవం, ఆరోగ్య సంరక్షణ, హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత సమాజంతో పాటు మనందరిపై ఉందన్నారు. నేటి వత వారి అనుభవాలను నేర్చుకుని, గౌరవించి వారి సూచనలు, సలహాలను స్వీకరించాలని అన్నారు. వృద్ధులపట్ల నిర్లక్ష్యం, వేధింపులు వంటి సమస్యలుపై అవగాహన కలిగించాలని అన్నారు. భద్రతతో కూడిన జీవితాన్ని వృద్ధులకు అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ జెడి షేక్ హబీబ్ భాషా, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, యంపిడివో బి.భార్గవి, డిప్యూటీ తహశీల్దారు జి.పవన్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు, వృద్ధులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


