కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించారారని సీపీ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.
పదవీ విరమణ చేసిన వారు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారు భావి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఎం .ఏ .రహీమాన్, ఏసీపీ, వైరాపి.సత్యనారాయణ, ఎస్సై (ఐ టి1 కోర్ టీమ్) వి. వెంకటేశ్వర్లు, వి ఆర్ ఎస్ ఐ, జె.వెంకటేశ్వర్లు, సయాద్ హుస్సేన్, జి. కాంతి, సీనియర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనరేట్ ఖమ్మం ఉద్యోగ విరమణ పొందారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం, ఆర్ఐ.. కామరాజు, పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


