నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
*స్వామివారిని దర్శించుకున్న మామునూరు వెంకటేష్
కాకతీయ,గీసుగొండ:
ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలంలోని ఊకల్ శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక అభిషేకము పూజలు నిర్వహించి వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మామునూరు ఏసిపి వెంకటేష్,గీసుగొండ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్తున్న సీఐ మహేందర్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి జిల్లా నలమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీ హర్ష ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు


