- నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి
- అర్హులందరికీ రుణాలు ఇవ్వాలి
- సమస్యల పరిష్కారానికే మాలల రణభేరి
- మహాసభను జయప్రదం చేయాలి
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
కాకతీయ, కొత్తగూడెం రూరల్: నవంబర్ 2న హైదరాబాదులో జరిగే మాలల రణభేరి మహాసభను జయప్రదం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలో ఆయన మాట్లాడారు. మాలల సమస్యల పరిష్కారం కొరకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని కోరుతూ నవంబర్ 2న హైదరాబాద్ లో జరిగే మాలల రణభేరి మహాసభను నిర్వహించనున్నామని తెలిపారు.
సభకు లక్షలాదిగా మాలలు తరలిరావాలని కోరారు. కొన్ని పార్టీలు మాలలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం దారుమన్నారు. ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభా కనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై శ్వేత విడుదల చేసి నిధులను ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కొప్పరి నవతన్, చింతల చిరంజీవి, రాష్ట్ర మహిళా నాయకురాలు బడికల పుష్పలత, జిల్లా నాయకురాళ్లు బి.స్వర్ణలత, కే.లావణ్య తదితరులు పాల్గొన్నారు.


