కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ మైనార్టీ వార్డ్ కమిటీల నియామకం చేపట్టారు. కొత్తగూడెం టౌన్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి ఖాజా బక్ష్ ఆధ్వర్యంలో 8 వార్డ్ లకు కమిటీలు నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిసిసి కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఖాన్ వారికి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
పార్టీ ఆదేశాలు పాటిస్తూ, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా అందరితో కలిసి పని చేయాలన్నారు. కాంగ్రెస్ మైనార్టీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షుడు ఎండి ఖాజా బక్ష్ ముఖ్య అతిథులు, నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ జేబి శౌరి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి కరీం, నాయకులు ఎండి గౌస్, ఎండి గౌస్ మొయినుద్దీన్, ఆయుబ్ ఖాన్, ఎండి అఫ్జల్, ఎండి హబీబ్, ఎండి నవాబ్, ఎండి తాజుద్దీన్, ఎండి రహీముద్దీన్, ఎండి అబ్బాస్, ఎండి అల్లాబక్ష, అంజత్ ఖాన్, ఖైరుల్లా ఖాన్ పాల్గొన్నారు.


