ఘనంగా చీకటి కార్తీక్ జన్మదిన వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు కార్తీక్ ను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ పితాంబరం తదితరులు మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో అంచలంచెలుగా ఎదిగి ఉమ్మడి జిల్లా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఐవైసి జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో సుజాతనగర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు బాల పాసి, పోస్ట్ ఆఫీస్ వాసు, తలుగు అనిల్, కున్సోత్ కిషన్, పూనెం శ్రీను, కసనబోయిన లక్ష్మణ్, జానీ భాయ్, మహిళా నాయకులు వాణి రెడ్డి, హైమావతి, జోగు రమాదేవి, సంధ్య ఐవైసి నియోజకవర్గ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, సుజాతనగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి గులాం మతిన్, పవన్, రామ్మూర్తి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.


