మిషన్ భగీరథ వద్ద సిబ్బంది ఆందోళన
కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో వ్యాప్తంగా మిషన్ భగీరథ సిబ్బంది సమస్యను ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు.ఏటూరునాగారం అంబేద్కర్ విగ్రహం ముందు,పాలంపేటలో మిషన్ భగీరథ సిబ్బంది గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆందోళనకు దిగారు.దసరా పండుగ ముందు ఆర్థిక ఇబ్బందులు తాలూకూ కష్టాలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది అందరూ ఏకతాటిపై మిషన్ భగీరథ కార్యాలయం వద్ద చేరుకొని నీటి సరఫరా లైన్‌ను ఆపివేసి, గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారు. సిబ్బంది మాట్లాడుతూ పలుమార్లు నాలుగు నెలల జీతాల విషయమై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు మండలాల సిబ్బంది నిరాహార దీక్ష చేపట్టారు. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి అని, ప్రతి కార్మికుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు.


