శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
పరసరాల పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం
స్వచ్ఛతా హి సేవాలో సింగరేణి అధికారులు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ప్రతి ఊరు.. ప్రతి ఇంటి పరసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మంచి వాతావరణం ఏర్పడడంతోపాటు ఆరోగ్యం లభిస్తుందని సింగరేణి అధికారులు పేర్కొన్నారు. గురువారం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్ల నందు ఈ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగానే దేశమంతటా “ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్” అనే నినాధంతో పరసరాలను పరిశుభ్ర పరచుకోవటానికి శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. అందరూ భాగస్వాములై ఆఫీసు గనుల నందు మన చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశుభ్రపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు, సీఎంఓ, డాక్టర్లు, సిబ్బంది నర్సింగ్ కళాశాల విధ్యార్ధినులు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలోని మార్చురీ చుట్టూపక్కల ప్రదేశాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జీవీ కిరణ్ కుమార్, సీఎంవో ఆర్.కిరణ్ రాజ్ కుమార్, సీఎంవో ఏఐ ప్రెసిడెంట్ టి.లక్ష్మిపతిగౌడ్, ప్రాతినిధ్య సంఘం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీతాంబరరావు, జీఎం (సర్వే) రాఘవేంద్ర రావు, ఏసీఎంవో ఎం.ఉషా, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు బి.శ్రీనివాస్, ఎం.సునిల్ కుమార్, జి.సురేష్, ప్రసాద్, డీవైపీఏలు మైత్రేయ బంధు, పి.బొశ్వంత్ అవినాష్, డాక్టర్లు, ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విధ్యార్ధినులు పాల్గొన్నారు.


