కాకతీయ, జూలూరుపాడు : మండలంలోని అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు వెంటనే అన్ని గ్రామల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చాంద్ పాషా మాట్లాడుతూ తీవ్ర వర్షాల వల్ల గ్రామాల్లో విష జ్వరాలు, మలేరియా, టైఫాడ్, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలం అయ్యాయని, దీంతో గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యాధులను నయం చేసుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలను ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని వాపోయారు.
అధిక వర్షాల వల్ల సరిగా పనులు లేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కావున తక్షణమే గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా పోస్టులను భర్తీ చేయాలని, రక్త పరీక్షా కేంద్రంలో అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.


