కాకతీయ, మెదక్: కామాంధుల వికృత చేష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే కాదు, నోరులేని జీవాలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో బర్రెలపై దాడి చేసి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి దారుణమే తాజాగా మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండలం, మీర్జాపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
స్థానిక రైతు సిద్దిరాములుకి కొన్ని పశువులు ఉన్నాయి. వాటిని ప్రతి రోజు పొలంలోని షెడ్డులో కట్టేస్తూ ఉంటారు. ఆదివారం కూడా అలాగే పశువులను కట్టి ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో కూలీగా పనిచేస్తున్న రోహిత్ (బీహార్ రాష్ట్రానికి చెందిన వాడు) రాత్రి 10 గంటల సమయంలో షెడ్డులోకి వెళ్లాడు. ఆ సమయంలో ఏడాది వయసు గల బర్రె దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనా మొత్తం షెడ్డులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఫుటేజీని చూసిన యజమాని షాక్‌కు గురయ్యాడు. వెంటనే రోహిత్‌ను పట్టుకుని, గ్రామస్థుల సహకారంతో దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి వికృత చేష్టలు చేసే వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో గేదెపై అత్యాచారం చేసిన యువకుడు
చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో గేదెల షెడ్డులో పని చేస్తూ, ఓ గేదెను అత్యాచారం చేసిన బీహార్‌కు చెందిన రోహిత్
ఈ ఘటనను సీసీ కెమెరాల్లో చూసి రోహిత్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన యజమాని సిద్ధిరాములు
కేసు నమోదు చేసి… pic.twitter.com/o6QJZXYOhG
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2025


