కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయ్యింది. ధ్వజారోహణానికి ముందు రోజులు చేపట్టే అంకురార్పణను మంగళవారం ఆలయ సన్నిధిలో సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8గంటల వరకు నిర్వహిస్తారు. మొదట ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్ట మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసే క్రుతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు షురూ కానున్నాయి. ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు.
TTD: నేడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


