సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియా కోమటిగల్లిలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రామ్మోహన్‌రావును(60) గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. సోమవారం రాత్రి రామ్మోహన్ రావు (60) తన భార్యతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో వారి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఇనప సుత్తితో దారుణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రామ్మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, 3టౌన్ సీఐ శివప్రసాద్, 1టౌన్ సీఐ కరుణాకర్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ పోలీస్ బృందం ఘటన స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో ఆధారాలు సేకరించింది.


