epaper
Thursday, January 15, 2026
epaper

సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది ఒక భాగోద్వేగం: హరీశ్ రావు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..ఏమన్నారో చూద్దాం

నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయం..

అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్..

వేలాదిమంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే, దశ దిశను మార్చే ఫ్యాక్టరీ ఇది.

2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు నర్మెట్ట నుండి ఒక ఫోన్ వచ్చింది..

నా పక్క పొంటి పొలమోడు బోరేస్తున్నడు. ఆ బోరు వేయకుండా ఆపండి అని ఫోన్ వచ్చింది.

ఈ ప్రాంతము కరువు ప్రాంతంగా ఉండేది. నంగునూరును కూడా కరువు మండలంగా ప్రకటించారు.

ఎక్కడైతే కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారో అక్కడ తాహసీల్దార్ అనుమతి తీసుకొని బోర్ వెయ్యాలి.

ఎవరైనా బోర్ ఏస్తే కలెక్టర్కు చెప్పి బోర్ బండిను ఆపించిన రోజులు ఉండేవి.

ఈరోజు తెలంగాణలో, సిద్దిపేటలో, నంగునూరులో బోరు బండ్లు మాయమైపోయాయి.

కెసిఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం అయితేనేమి పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల పథకమైతేనేమి, చెరువులయితేనేమి, చెక్ డ్యాములైతేనేమి ఈ రాష్ట్రం సస్య శ్యామలమై భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి.

అశ్వరావుపేట, సత్తుపల్లి సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి గాలిలో తేమశాతం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేది.

కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరు గాని, కాళేశ్వరం గాని, సీతారామ గాని వాటి ఫలితంగా తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారింది.

ఖమ్మం జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఆశ్చర్యపోయాను. అక్కడ ఉండే రైతులు సంపూర్ణమైన రైతులుగా ఉన్నారు.

కోతుల బాధ లేదు. చీడ పట్టే బాధ లేదు. ఒక్కసారి పెడితే 30 ఏళ్ల వరకు నెలనెల జీతం పడినట్టు ఆదాయం వస్తుంది.

చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు 60,000 ఐటీ ఉద్యోగం వదిలి పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు.

మంచి ఆదాయం ఉంది అని సంతోషం వ్యక్తం చేశాడు.
ఐఐఓఆర్ , ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ వారు చెప్పితే తప్ప ఇక్కడ పామాయిల్ సాగు చేయలేమని నాకు చెప్పారు.

సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దాం అని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో.. 2018లో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు ఉండదు అని చెప్పి వెళ్ళిపోయారు.

గాలిలో తేమశాతం తక్కువ ఉంది ఇక్కడ పామాయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారు.

ఆ తర్వాత 2019లో అనంతగిరి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగరుతోపాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం.

2021లో పరిశోధన చేసిన తర్వాత మళ్లీ గాలిలో తేమ శాతం పెరిగింది ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించారు.

కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు అవుతున్నది.

రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరం.

బోరు బండ్లు మాయమైనాయి అంటే కారణం కాళేశ్వరం.

వరి వండుతుంది కానీ ఎకరానికి 30,000 కంటే ఎక్కువ మిగలదు..

ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమాని ఎరువులు దొరకక వరి కష్టమైంది.

కానీ ఆయిల్ ఫామ్ సాగు లాభసాటిగా ప్రతినెల జీతం పడ్డట్టు రైతుకు ఆదాయం వస్తుంది.

2022లో జూన్ 5 నాడు నంగునూరు మండల్ రామచంద్రాపూర్ గ్రామంలో మడుగు ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి పామాయిల్ మొక్క నాటాను..

ఒక్కొక్క రైతును గుర్తించి ఒక్కొక్క ఎకరం పెట్టించి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను.

అందుకే ఏదో భాగోద్వేగం.. అందుకే ఇది మా కల..

చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ వరప్రదాయిని కాబోతున్నది.

విత్తనం నాటింది బీఆర్ఎస్… కానీ పండ్లు తినడానికి మాత్రం బయలుదేరింది కాంగ్రెస్ వాళ్లు..

ఈ ఫ్యాక్టరీ రావడానికి వెనుక కష్టం ఎవరిది? తంట ఎవరిది? చెమట చుక్కలు చిందించింది ఎవరు అనేది ప్రజలకు తెలుసు..

2022 ఏప్రిల్ నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీద శంకుస్థాపన చేసింది మన ప్రభుత్వం.

పామాయిల్ కు పుట్టినిల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పెట్టాము.

భారతదేశంలో ఏ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి అయినా వంద టన్నుల గెలలు పంపితే 19 టన్నుల ఆయిల్ మాత్రమే వస్తది..

కానీ ఈ ఫ్యాక్టరీలో 100 టన్నుల గెలలకు 20 టన్నుల పామాయిల్ వస్తుంది.

ఈ లాభాలు రైతుకే వస్తాయి.

గోద్రెజ్, నవభారత్, పతంజలి కంపెనీ వాళ్ళు వచ్చి ఈ టెక్నాలజీని చూసి పోతున్నారు.

ఇయాల రేవంత్ రెడ్డి రిబ్బను కత్తిరించడానికి కత్తేర్లు జేబులో పెట్టుకొని బయలుదేరిండు.

కెసిఆర్ గారి ఆలోచన ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉండే.

10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు.

మల్లి కేసీఆర్ గారు వస్తారు. జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు.

వరిలో, మక్కలో తిప్పి తిప్పి కొడితే 60, 70 వేల కంటే లాభం లేదు. ఇకముందు కోకో పంట వైపు అడుగులు వేద్దాం.

ఫ్యాక్టరీ ప్రారంభమై నిన్ననే ట్రయలు కూడా ప్రారంభించారు..

పామాయిల్ లాభసాటి పంట రైతులు అందరూ పామాయిల్ పంటను వెయ్యండి.

ఈ సంతోషంలో పాల్గొన్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..! సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది బ్యాంక్ ఖాతాల...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img