కాకతీయ, మణుగూరు: భద్రాద్రి జిల్లాలో ఆదివాసి ఇసుక ర్యాంపుల్లో టిజిఎండిసి పిఓ శంకర్ నాయక్ గుత్తేదారులకు కొమ్ముకాస్తూ అమాయక ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ రైసింగ్ కాంట్రాక్టర్లు ఖనిజ సంపద దోచుకుపోతున్న చీమకుట్టినట్టు కూడా లేదని అలెం కోటి మండిపడ్డారు. రాయిగూడెం, కోడి ముత్తయ్యగుంపు, అన్నారం పద్మ గూడెం, సాంబాయిగూడెం తదితర రాంపులలో రైసింగ్ కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ అమాయక ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ కేసులు కట్టించుకొని పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు.
టీజీఎండిసి పిఓను మరియు లంబాడీలను ఎస్టి జాబితా నుండి లంబాడీలను తొలగించే వరకు అమాయక ఆదివాసీలపై లంబాడిల ఆగడాలు నశించాలని ఈ విషయంలో నాయకులతో త్వరలో రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి పిఓ శంకర్ నాయక్ ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసే వరకు ఆదివాసీలందరిని ఏకం చేసి దశల వారీగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
అదిలాబాద్ జోడెన్ ఘాట్ నుండి అశ్వరావుపేట వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు ఉధృతం చేస్తా ఉంటే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు ఆదివాసీలపై పెత్తనం ఏంటని జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో హక్కులు సాధించుకుంటే ప్రక్క రాష్ట్రం నుండి దొడ్డిదారిలో వచ్చి ఆదివాసులకు చెందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులు ఉద్యోగాలు అన్ని అనుభవిస్తూ ఆదివాసులను అనగదొక్కుతూ ఆర్థికంగా బలపడుతూ కోట్లకు పడగలెత్తి ఆదివాసిల సర్వసంపదను దోచుకొని వెళ్తున్నారని ఘాటుగా విమర్శించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆర్టికల్ 339(భారత రాజ్యాంగం 1950) ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సింది పోయి ఇప్పటివరకు ఆర్టికల్ 339 గురించి ప్రస్తావనగాని పరిశీలనగానే లేదన్నారు.16 రాష్ట్రాల్లో 16 రకాల రిజర్వేషన్ అనుభవిస్తూ ఓసి, బీసీ ఎస్టీ ఎస్సీలుగా అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎస్టి రిజర్వేషన్లు అనుభవిస్తూ అమాయక ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తూ ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చి ఆదివాసి హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇట్టి సమస్య పై రౌండ్ టేబుల్ సమావేశం ఈనెల 28 వ తేదీన మణుగూరు వేదికగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పే విధంగా, గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం ఉంటుందని తెలియజేశారు.


