కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణి కాలరీస్ కంపెనీ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి, కార్మికుడు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం తిరుమల రావు అన్నారు. సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఎం)బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కొత్తగూడెం ఏరియాను శనివారం ఆయన సందర్శించారు. ముందుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు కొత్తగూడెం ఏరియా తరపున పూలమొక్క అందించి శాలువాతో స్వాగతించారు.
అనంతరం డైరెక్టర్ కొత్తగూడెం ఏరియాలోని అధికారులు సూపర్వైజర్లు ఎంతమంది పనిచేస్తున్నారు ఇంకా ఎంతమంది వేకెన్సీ ఉందని సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావం పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిఎంతో పాటు ఎస్ ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, డీజీఎం(పర్సనల్) జివి.మోహన్ రావు, డీజీఎం(ఐఈడి)ఎన్.యోహాన్, డిజిఎం(ఈ అండ్ఎం) ఏరియా వర్క్ షాప్ జె.క్రిస్టోఫర్, ఆయా విభాగాల అధిపతులు, ఈఅండ్ఎం అధికారులు పాల్గొన్నారు.


