కాకతీయ, కొత్తగూడెం రూరల్: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పిటిఎం సమావేశం నిర్వహణతో పాటు ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఎస్ జి ఎఫ్) సారధ్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు బతుకమ్మలను తయారు చేసుకొని వచ్చి పాఠశాల ప్రాంగణంలో అందరూ కలిసి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు.
కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ పొగాకు లక్ష్మి, బొమ్మనపల్లి జిల్లా పరిషత్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మంగీలాల్, ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ ఉమెన్స్ గిల్డ్ భద్రాద్రి జిల్లా కోఆర్డినేటర్, రిటైర్డ్ హెచ్ఎం మేకల జ్యోతి రాణి, జాయింట్ సెక్రటరీ కళ్యాణి, స్కూల్ హెచ్ఎం ఉమా, అసిస్టెంట్ టీచర్ జరపల పద్మ, ఐఆర్పి టీచర్ నీరజా షారోన్, సిఆర్పి అబ్బయ్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్ జి ఎఫ్ అడ్వైజర్స్, రిటైర్డ్ తహసిల్దార్ నాగరాజు ప్రమీల దంపతులు బహుమతులను అందజేశారు.


