కాకతీయ, కొత్తగూడెం: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరా నవరాత్రుల కొరకు హడావుడి మొదలైంది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా నవరాత్రుల్లో భాగంగా విగ్రహాల అమ్మకాలు జోరు అందుకున్నాయి. అనేక రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారి విగ్రహాల కోసం భక్తులు వెతుకులాట మొదలుపెట్టారు.
తమ మండపాల్లో ఆకర్షణమైన అమ్మవారి రూపాన్ని కొలువుంచాలని భక్తులు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దుర్గమ్మ వారి విగ్రహాల వ్యాపారం జోరు అందుకుంది. ఈనెల 22వ తారీఖు నుండి అమ్మవారి నవరాత్రులు మొదలుకానున్నాయి. ఈ మేరకు విగ్రహాల సెలక్షన్లో బిజీ అయిపోయారు భక్తులు.



