కాకతీయ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బయ్యారం మండలానికి చెందిన బుర్ర యాకయ్య ఉత్తమ పీఈటీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు మెమొంటోను జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు మురళీ అందజేశారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మదార్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని నింపుతూ క్రీడారంగంలో అనేక మంది విద్యార్థులను ప్రతిభవంతులుగా తయారు చేశారని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు యాకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా రెండోసారి జిల్లా ప్రైవేట్ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నిలిచారు.


