epaper
Sunday, March 1, 2026
epaper

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్: డిప్యూటీ సీఎం

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అన్ని విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని వివరించారు. కర్ణాటక, హర్యానా వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలను కూడా అధిగమించడం తెలంగాణ సాధించిన గర్వకారణమని అన్నారు.

వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్‌లోనే 33.64 శాతం సాధించడం అభినందనీయమైన అంశం అని బ్యాంకర్లను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విస్తృతంగా రుణాలు ఇవ్వడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట ఇప్పటివరకు 30 వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఇది బ్యాంకింగ్ రికవరీ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు.

రైతులకు సకాలంలో రుణాలు అందించడం అత్యవసరమని, వారికి అనవసరమైన ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల భారం మోపవద్దని స్పష్టం చేశారు. బ్యాంకర్లు రైతులను మానవీయ కోణంలో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతు అనేది కేవలం ఒక కస్టమర్ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటి వారని గుర్తు చేశారు.

బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ముందుకు వస్తే రైతులు మరింత బలపడతారని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలమని తెలిపారు. రైతులకు మద్దతుగా బ్యాంకింగ్ రంగం చురుకైన సహకారం అందిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img