కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడాన్ని తమ పార్టీ ఆధినేత తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై కాంగ్రెస్ డొల్లతనం మాజీ మంత్రి హరీశ్ రావు ఎండగట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఆయన మొక్కారంటూ కవిత చేసిన ఆరోపణలు చాలా బాధకలిగించాయన్నారు.
హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదని లేదన్నారు. కవిత గతంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత వెళ్తున్నారు. కేసీఆర్ కుమార్తెగా గౌరవాన్ని ఆమె నిలబెట్టుకోలేకపోయారు. కవిత తన గొయ్యి తానే తవ్వుకున్నారని పద్మాదేవేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.


