టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి అధ్యక్షుడిగా ఇరుగు సైదులు
కాకతీయ, తుంగతుర్తి: యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇరుగు సైదులు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. తుంగతుర్తిలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు పాల్వాయి జానయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వంగాల వెంకన్న, ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇరుగు సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గుండగాని రాము, ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టులు తడకమల్ల సురేష్, యాకన్న, షేక్ జానీ, ఎనగందుల అశోక్ తదితరులు హాజరై నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.


