epaper
Monday, March 2, 2026
epaper

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు

సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్

కాకతీయ,చేర్యాల: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ సూచించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని పలు కాలనిలల్లో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయగా చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్, ఎస్సై జి.అపూర్వ రెడ్డితో కలిసి సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ మాట్లాడారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనల్లో నిందితుల కదలికలను గమనించి కేసులను త్వరగా ఛేదించవచ్చన్నారు. ఈ కెమెరాలు నేరాలపై పర్యవేక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని,ప్రజల భద్రతకు ఇది ఒక నూతన అడుగు లాంటిదన్నారు. ప్రస్తుతం మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు మహిళల రక్షణకు ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తాయని తెలిపారు. రోడ్డుప్రమాదాలను తగ్గించడంలో కూడా ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి.

కెమెరాలు ఉండటంతో నేరస్తుల్లో భయం, ప్రజల్లో భద్రత పట్ల భరోసా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, మండల కేంద్రంలో కూడా సీసీ నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నది తమ లక్ష్యం అని పేర్కొన్నారు.ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడే పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. సీసీ కెమెరాలు లేని టైంలో కేసుల ఛేదన కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు వాటి సాయంతో విచారణ వేగంగా జరుగుతోందన్నారు.పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించిన గ్రామ ప్రజలకు, పాలకమండలి సభ్యులను అభినందించారు. అంతకు ముందు అడిషనల్ డీసీపీ కుషాల్కర్ కు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్ నాయక్ , ఎస్‌ఐ అపూర్వ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ ఎడబోయిన కుమార్,ఉప సర్పంచ్ పోలోజు రాజబాబు,గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి - హైదరాబాద్ బ్రాండ్‌కు...

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి * చేర్యాల ఎస్సై ని కలిసిన...

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి కాకతీయ,...

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img