epaper
Monday, March 2, 2026
epaper

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!
శంకరపట్నం వారసంత రోడ్డుపై ఏర్పాటు
జాతీయ రహదారిపై ప్రమాదాలకు ఆహ్వానం
పట్టించుకోని అధికారులు, ప్రజల ఆగ్రహం

కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే వారసంత స్థానికులకు సమస్యగా మారింది. మార్కెట్ యార్డు బస్టాండ్ వెనుక అనుమతి ఉన్నప్పటికీ, సంతను వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి పక్కన, కేశవపట్నం బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం చుట్టూ నిర్వహిస్తున్నారు.మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు, వ్యాపారులు కూరగాయలు, బట్టలు, నిత్యావసర సరుకులు తెచ్చి అమ్ముతుంటారు. వందల సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు కోసం తరలివస్తారు. అయితే రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు పెట్టడం వల్ల ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు బస్టాండ్ నుంచి ప్రయాణిస్తుండగా, జాతీయ రహదారి పక్కనే సంత ఏర్పాటు చేయడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాల తర్వాతా స్పందన లేదు

ఇటీవల బస్టాండ్ ఎదురుగా బస్సులు ఢీకొని ప్రమాదాలు జరిగిన ఘటనలు చోటుచేసుకున్నా, సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు సిబ్బంది కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపై దుకాణాలు పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే సంతను అనుమతి ఉన్న ప్రదేశంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు పెట్టనీయకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు ఎనిమిది మందిని బైండోవర్ చేసిన...

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జిల్లాలో...

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ కాకతీయ, కరీంనగర్ : జనవరి...

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి కాకతీయ, వేములవాడ...

పోలీసులు మీకోసం అను శీర్షికన

పోలీసులు మీకోసం అను శీర్షికన -పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన...

శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు

శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు కాకతీయ, కరీంనగర్ : స్థానిక...

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి ఉమ్మడి జిల్లాల్లో ప్రజావాణికి విన‌తుల వెల్లువ‌ అర్జీల పెండింగ్‌కు నో నిర్ణీత గడువులో పరిష్కారం...

వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి

వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి ఫిబ్రవరి సమావేశం ఎందుకు నిర్వహించలేదు ‘చెరో రెండున్నర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img