ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు
సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు
త్యాగాలు వృథా కావొద్దు – నాయకుల పిలుపు
వర్గీకరణతో మాదిగల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం
కాకతీయ, కారేపల్లి : ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు సింగరేణి మండల కేంద్రంలోని సినిమా సెంటర్ ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద ఆదివారం ఘనంగా జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదెర్ల రామారావు, కుల పెద్ద ఆదెర్ల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు హాజరై అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు వృథా కావొద్దని, వారి ఆశయ సాధనకు అందరూ కట్టుబడాలని పిలుపునిచ్చారు. ఎస్సీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా వర్గీకరణ అవసరమని పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ అమరవీరుల త్యాగం ఎప్పటికీ గుర్తుండాలని, ఎస్సీ వర్గీకరణ అమలుతో మాదిగల జీవితాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను స్మరించుకోవడం బాధాకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుల పెద్ద ఆదెర్ల అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు రామారావు, జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు, ఆదెర్ల ఉపేందర్, గజ్జల శ్రీను, అంజయ్య, ప్రసాద్, సాంబ, మహిళా నాయకురాలు అరుణ, గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.


