విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి
* మార్చు 1 నుంచి మీటర్ రీడర్లు సమ్మెబాట
కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల సెక్షన్ మీటర్ రీడర్లు మార్చి 1వ తేదీ నుండి సమ్మె చేయనున్నట్లు తెలిపారు. తమను సంస్థలో ఆర్టిజన్లుగా చేర్చుకుంటామని అప్పటి సీఎం కేసీఆర్, ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా, నేటి వరకు న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మీటర్ రీడర్లు తెలిపారు.ఈ మేరకు ఆదివారం చేర్యాల సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గత 25ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. పని భారాన్ని పెంచి యాజమాన్యం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విధులకు వెళ్ళేదేలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలొ నజిరుద్దీన్, రాజు, శివ,సందీప్,అలీం,సిద్దు , వంశీ,వెంకటేష్ తో పాటు తదితర మీటర్ రీడర్ కార్మికులు పాల్గొన్నారు.


