epaper
Monday, March 2, 2026
epaper

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!
కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం!
ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల త‌యారీ
జాత‌ర‌లో ఆధిప‌త్యం చాటుకునేందుకు నేత‌ల య‌త్నాలు
ప్రభల రూపంలో అధికార పార్టీలో వ‌ర్గ‌పోరు బ‌హిర్గ‌త‌మ‌వనుందా..?
కాంగ్రెస్‌లో రెండు ప్రభలు.. కొండా వర్గం భారీ ప్రభ
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి సైతం పెద్ద ప్ర‌భ‌లు జాత‌ర‌లోకి
ఈ సారి జాత‌ర‌లో హైటెన్ష‌న్ త‌ప్ప‌దా..?!

కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సమీపిస్తున్న వేళ గీసుగొండ, సంగెం, చెన్నారావుపేట, పరకాల, నర్సంపేట, దుగ్గొండి, ఖిలా వరంగల్ మండలాల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రతి ఏడాది జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రభల తయారీ పనులు ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ప్రభలు కేవలం భక్తి చిహ్నాలుగా కాకుండా రాజకీయ ప్రాధాన్యానికి కూడా ప్రతీకలుగా మారుతున్నాయన్న చర్చ జోరుగా వినిపిస్తోంది. జాతరలో తమ బలం, ఆధిపత్యం చాటుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు భారీ ఎత్తులో ప్రభలను సిద్ధం చేస్తున్నాయి. ఎత్తు, లైటింగ్, అలంకరణ, బండ్ల నిర్మాణం… ప్రతి అంశంలోనూ ప్రత్యేకత కోసం పోటీ పడుతున్నాయి. ఈ ప్రభల పందెం వెనుక వర్గపోరు కూడా దాగి ఉందన్న ప్రచారం మండలాల్లో చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్‌లో రెండు ప్రభలు.. వర్గాల మధ్య పోటీ

కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు ప్రభల రూపంలో బహిర్గతమవుతున్నాయి. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో రెండు భారీ ప్రభలను సిద్ధం చేస్తున్నారు. ఒక వర్గం 54 అడుగుల ఎత్తుతో కొత్త ప్రభను నిర్మిస్తుండగా, మరొక వర్గం 45 అడుగుల ప్రభను సిద్ధం చేస్తోంది. రెండు వర్గాలు తమ ప్రభనే జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిపేందుకు శ్రమిస్తున్నాయి. దీంతో జాతరలో అధికార పార్టీలో వర్గపోరు స్పష్టంగా కనిపించనున్నదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కొండా వర్గం భారీ ప్రభ

కొండా వర్గీయులు ఈసారి 54 అడుగుల ఎత్తుతో భారీ ప్రభ బండిని నిర్మిస్తున్నారు. బలమైన నిర్మాణం, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, రంగురంగుల లైటింగ్‌తో ప్రభను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఊరేగింపులో డప్పు కళాకారులు, నృత్య బృందాలు, బాణసంచా ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఎత్తు పరంగా ఈ ప్రభనే ఈసారి హైలెట్ అవుతుందని వర్గీయులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే వర్గం 45 అడుగుల ప్రభ

ఎమ్మెల్యే రేవూరి వర్గీయులు 45 అడుగుల ఎత్తుతో ప్రభను సిద్ధం చేస్తున్నారు. సంప్రదాయ శైలిలో దేవతా చిత్రాలతో పాటు ఆధునిక లైటింగ్ సదుపాయాలు కల్పిస్తూ ప్రభను రూపుదిద్దుతున్నారు. భక్తి, భవ్యత కలగలిపిన ఈ ప్రభ కూడా జాతరలో ఆకర్షణగా నిలవాలని వర్గీయులు కసరత్తు చేస్తున్నారు. తమ ప్రభ ఊరేగింపును ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.

బీజేపీ, బీఆర్ఎస్ ప్రభలు సైతం భారీగానే..

కాంగ్రెస్‌లోనే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా భారీ ప్రభలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి పార్టీ తమ ప్రభ ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ మార్పులు చేస్తూ భక్తులను ఆకట్టుకునేలా అలంకరణలు చేపడుతోంది. ఎత్తు, ఆకర్షణీయమైన దీపాలంకరణలు, సంగీత బృందాలతో జాతరలో తమ ఉనికిని చాటుకోవాలని యత్నిస్తున్నాయి. జాతర రోజున ప్రభల ఊరేగింపు గ్రామాన్ని కాంతులతో ముంచెత్తనుంది. అయితే భక్తి ఉత్సాహంతో పాటు రాజకీయ హైటెన్షన్ కూడా తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభల బలాబలాల మధ్య జరిగే ఈ పోటీ కొమ్మాల జాతరను ఈసారి మరింత రసవత్తరంగా మార్చనుందని గ్రామస్తులు చెబుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img