epaper
Sunday, March 1, 2026
epaper

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…?!

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…?!
పేదల ఇళ్లపై బుల్డోజర్ రాజకీయం!
పట్టాలు ఉన్నా ఇళ్లను ఎందుకు కూల్చారు?
పేదలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
వెలుగుమట్లలో కూల్చివేతలు ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనం
ఏ ఇంటిని ముట్టుకున్న పేదోళ్ల కన్నీటి కథలే
భూదాన్ బాధితులకు అండ‌గా బీఆర్ఎస్
శాసనసభ నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాటం చేస్తాం
వ‌చ్చే మా ప్ర‌భుత్వంలో ప్ర‌తీ ఒక్క‌రికి ఇక్క‌డే ఇళ్లు క‌ట్టిస్తాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

కాకతీయ, ఖమ్మం బ్యూరో : “వెలుగుమట్లలో నేను చూసింది హృదయాన్ని కలచివేసే దృశ్యం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నేను అడుగుతున్నాను. పట్టాలు ఉన్న పేదల ఇళ్లపై బుల్డోజర్ నడపటమేనా పాలన? పేదల ఇళ్లను కూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది? పట్టాలు ఉన్నా ఇళ్లను ఎందుకు కూల్చారు? దీనికి ఈ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. “ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…? పట్టాలు ఉన్న పేదల ఇళ్లపై బుల్డోజర్ నడపటమేనా పాలన? పేదల ఇళ్లను కూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది?” అని ప్రశ్నించారు. ఖ‌మ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేత‌ను ఆయన ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనంగా అభివర్ణించారు. గురువారం ఖ‌మ్మం జిల్లా వెలుగుమ‌ట్ల‌కు చేరుకున్న బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా నాయ‌కులు, మాజీమంత్రి పువ్వాడ అజ‌య్‌, ముఖ్య నేత‌ల‌తో క‌లిసి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్బా ధితులను పరామర్శించిన కల్వకుంట్ల తారక రామారావు, భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అనుమ‌తులిచ్చి కూల్చివేయ‌డం అమానుషం..!

“నేను ప్రతి ఇంటి ముందు నిలబడి బాధితుల మాటలు విన్నాను. వారి చేతుల్లో పట్టాలు ఉన్నాయి. భూదాన్ భూముల కేటాయింపు పత్రాలు ఉన్నాయి. ఆస్తి పన్ను రశీదులు ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. అలాంటివారి ఇళ్లను అర్ధరాత్రి వేళ ఖాళీ చేయించి కూల్చివేయడం అమానుషం కాదా? ఏ ఇంటిని ముట్టుకున్నా అక్కడ పేదోళ్ల కన్నీటి కథలే కనిపిస్తున్నాయి. చిన్నారులు రోడ్డుపై ఉన్నారు. వృద్ధులు ఆకాశం కిందే ఆశ్రయం పొందుతున్నారు. ఇది ప్రభుత్వ కర్కశత్వం కాకపోతే మరేమిటి?” అని ప్రశ్నించారు. “గతంలో జీవోల ప్రకారం దరఖాస్తులు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే నివసించారని ప్రజలు చెబుతున్నారు. సంవత్సరాలుగా పన్నులు చెల్లించారు. ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అదే ప్రభుత్వం అక్రమం అంటోంది. ఇది న్యాయమా? ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బుల్డోజర్లు పంపడం సరైన పరిపాలనలా కనిపిస్తుందా?” అని నిలదీశారు.

పత్రాలే సాక్ష్యం… పేదలే నష్టపోయారు

“బాధితులు తమ పత్రాల కట్టలను నాకు చూపించారు. భూదాన్ కేటాయింపు పత్రాలు, పన్ను రశీదులు, ఇంటి సంఖ్య నమోదు, ఇత‌ర‌ ఆధారాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికే పన్నులు చెల్లించిన ప్రజలను ఒక్కసారిగా తప్పుదారులుగా ముద్రవేయడం అన్యాయం. ఇళ్ల కూల్చివేతతో పిల్లల చదువులు ఆగిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని కేటీఆర్ ప్రశ్నించారు. “భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావిస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తాం. చట్టపరమైన అన్ని మార్గాలు అనుసరిస్తాం. పేదల హక్కుల కోసం వెనుకడుగు వేయం” అని స్పష్టం చేశారు. “ఎవరూ అధైర్యపడవద్దు. వచ్చే మా ప్రభుత్వంలో కూల్చిన చోటే ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తోంది. కానీ మీరు ఐక్యంగా ఉంటేనే న్యాయం సాధ్యమవుతుంది. చట్టం మీవైపే ఉంది. భయపడాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు. “వెలుగుమట్ల ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ నాకు రాజకీయాల కంటే ముఖ్యమైంది పేదల గృహహక్కు. పేదల ఇళ్లపై బుల్డోజర్ నడిపే పాలనను మేము సహించం. ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్న వేస్తూనే ఉంటాం. పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు” అని కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img