సామాన్యుడి సొంతింటి కల సాకారం చేసిన ఎమ్మెల్యే
కాకతీయ,కామేపల్లి:మండల వ్యాప్తంగా సోమవారం ‘ఇందిరమ్మ రాజ్యపు’ ఆనందం వెల్లివిరిసింది. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తూ.. జోగుడెం, టేకులతండా, పాతలింగాల, పొన్నెకల్లు, మరియు రాయి గూడెం గ్రామ పంచాయతీల్లో కోట కల్పన-రాజు దంపతులనూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
గృహప్రవేశాల మహోత్సవానికి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ బోర్డు చైర్మన్, శాసనసభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామగ్రామాన వీరికి మహిళలు మంగళహారతులతో, కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా మోతలతో ఘనస్వాగతం పలికారు.

పేదవాడి సొంతింటి కల – ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “ఇందిరమ్మ ఇళ్లు కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టినవి కావు.. అవి పేదల ఆత్మగౌరవ ప్రతీకలు” అని వారు కొనియాడారు. లబ్ధిదారులతో కలిసి సామూహికంగా పాలు పొంగించి, కొత్త ఇళ్లలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
ఈ ఐదు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో కామేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ ఎమ్మార్వో సిహెచ్ సుధాకర్ రెడ్డి, హౌజింగ్ ఏఈ మరియు నాయకులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు,గింజల నరసింహారెడ్డి, బాధవత్ నాగరాజు గోవింద్రల సర్పంచ్ కమల దేవయ్య, ఉప సర్పంచ్ ఆలోత్ శివ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు లావుడియా వినోద్ కుమార్, మరియు జగదీశ్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు.ఐదు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ మహిళా నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేశారు.
గ్రామాల్లో పండుగ వాతావరణం
జోగుడెం నుండి పొన్నెకల్లు వరకు ప్రతి గ్రామం తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో ముస్తాబైంది. తమ సొంతింటికి ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ప్రారంభించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


