“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి”
కాకతీయ, రామకృష్ణాపూర్ : గత నాలుగు నెలలుగా పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. స్థానిక క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను కలిసిన లబ్ధిదారులు సోమవారం వినతి పత్రాన్ని అందించారు. తక్షణమే అవసరమయ్యే నాలుగు కమర్షియల్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పిచ్చి మొక్కలను తొలిగించి అంతర్గత సీసీ రోడ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సదానందం,శ్రీనివాస్,నరేష్,నర్సమ్మ,ఏల్లాబాయ్,మాధవి,ప్రభ,సరిత,సత్యవతి పాల్గొన్నారు.


