మేనకోడలి వేడుకలో ఎమ్మెల్యే కోరం కనకయ్య
పుష్పలంకరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ
పట్టువస్త్రాలతో ఆశీర్వదించిన కనకయ్య దంపతులు
కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని చిన్నమడెంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దమడెంపల్లిలో ఆదివారం నిర్వహించిన పుష్పలంకరణ వేడుకలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సోది సింధు–కోటేశ్వరరావు దంపతుల కుమార్తె చి. ఉదయశ్రీ ఒడిబియ్యం కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనకోడలికి పట్టువస్త్రాలు సమర్పించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. బంధుమిత్రుల మధ్య జరిగిన వేడుకలో ఎమ్మెల్యే అందరినీ ఆత్మీయంగా పలకరించారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ మండలరాం మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ యదలపల్లి అనసూర్య, మడుగు సాంబమూర్తి, పులిగండ్ల మాధవరావు, బోళ్ళ సూర్యం, జనగం కోటేశ్వరరావు, సర్పంచ్ పాయం స్వాతి, మాజీ సర్పంచ్ కల్తీ పద్మ తదితరులు పాల్గొని చిన్నారి ఉదయశ్రీని ఆశీర్వదించారు.


