మిషన్ వాక్’ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
350 మందికి పైగా రోగులకు పరీక్షలు
ఫిజియోథెరపీతో మెరుగైన ఫలితాలు సాధ్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ లక్ష్యం
కాకతీయ, కారేపల్లి : మిషన్ వాక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 350 మందికి పైగా రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాన్ని న్యూరో రిహబ్ ఎడ్యుకేటర్ బాదావత్ రవి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పక్షవాతం వంటి నర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఫిజియోథెరపీ పునర్జన్మ వంటిదని తెలిపారు. బాధితులు తిరిగి సాధారణ జీవితం గడపడానికి సహకరించడమే తమ లక్ష్యమన్నారు. శిబిరంలో కీళ్ల నొప్పులు, నరాలు, వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు



