epaper
Sunday, March 1, 2026
epaper

మసీద్‌పల్లిలో ఈతవనం భూమిపై వివాదం

మసీద్‌పల్లిలో ఈతవనం భూమిపై వివాదం

– గౌడ–ముదిరాజ్ వర్గాల మధ్య ఉద్రిక్తత
– జీవనాధారమైన ఈత చెట్ల తొలగింపుపై ఆగ్రహం
– పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం

కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని మసీద్‌పల్లి గ్రామంలో గౌడ సంఘం, ముదిరాజ్ వర్గాల మధ్య ఈతవనం భూమి వివాదం చెలరేగింది. జీవనోపాధిగా భావిస్తున్న ఈత చెట్లను ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారని గౌడ సంఘం నాయకులు ఆరోపించారు. గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ… గతంలో గౌడ సంఘానికి సంబంధించిన స్థలం సొసైటీ లేకపోవడంతో ఎల్లమ్మ గుడి ట్రస్ట్ పేరిట నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటినట్లు చెప్పారు. మంజీరా పైప్‌లైన్ పనుల సందర్భంలో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వగా, మిగతా ప్రభుత్వ భూమిని ఎల్లమ్మ గుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి మంత్రి, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు కూడా హాజరై మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇటీవల ఆ భూమి తమదేనంటూ ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేసి ట్రాక్టర్‌తో కొన్ని ఈత మొక్కలను తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాలు రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెట్లు తొలగించిన వారిని గజ్వేల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్సై తెలిపారు. తొగుట సీఐ లతీఫ్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. గౌడ సంఘం సభ్యులు తమ జీవనాధారమైన ఈత చెట్లను ధ్వంసం చేయడం తీరని నష్టమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాం గౌడ్, గౌడ సంఘం నాయకులు జయ వెంకటస్వామి, నరేష్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img