epaper
Sunday, March 1, 2026
epaper

రైతు జీవనధారగా కాళేశ్వరం

రైతు జీవనధారగా కాళేశ్వరం
కేసీఆర్ దూరదృష్టితో పచ్చని తెలంగాణ
మండుటెండల్లోనూ గోదావరి జలాలతో సాగు విస్తరణ
కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లతో బీడు భూములు పంటచేలుగా మార్పు
హల్దీ వాగు జీవనదిగా మారి లక్షల ఎకరాలకు సాగునీరు
రైతు బంధు, బీమాతో రైతులకు ఆర్థిక భరోసా
గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

కాకతీయ, గజ్వేల్ : తెలంగాణలో రైతుల జీవనాధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని, మండుటెండల్లోనూ గోదావరి జలాలను పొలాలకు అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గ‌జ్వేల్‌లో ఆయ‌న‌ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి విస్తరణతో తెలంగాణలో వ్యవసాయం కొత్త దిశగా పయనించిందని తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ ద్వారా విడుదలైన నీరు హల్దీ వాగు, సంగారెడ్డి, రామాయంపేట కాల్వలతో పాటు అనేక ఉపకాల్వల ద్వారా 50కి పైగా గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు, చెరువులను నింపిందన్నారు. హల్దీ వాగు జీవనదిగా మారి ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పచ్చని పంటచేలుగా మారాయని వివరించారు. నిజాంసాగర్ వరకు నదికి ఇరువైపులా లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని తెలిపారు. జగదేపూర్, ఆలేరు, భువనగిరి, నల్గొండ ప్రాంతాలకు ఎండాకాలంలో కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీరు అందించడం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకత అని అన్నారు. ఒకప్పుడు నీటి కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు సంవత్సరం పొడవునా పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ కాల్వ ద్వారా కూడవెల్లి వాగులోకి నీరు చేరడంతో గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలతో పాటు మానేరు, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా సాగు విస్తరించిందన్నారు.

కాళేశ్వ‌రంతో భూగర్భ జలాల మట్టం పెరిగాయి

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావంతో భూగర్భ జలాల మట్టం పెరిగి బావులు, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడిందని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి పథకాలతో రైతులు ఆర్థికంగా బలపడ్డారని చెప్పారు. వ్యవసాయానికి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడంలో విఫలమైందని, కాల్వల నిర్మాణంలో పురోగతి లేదని విమర్శించారు. రైతులకు సకాలంలో సాగునీరు, విద్యుత్, ఎరువులు అందడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించి, సాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img