యుద్దాలు ఆపి శాంతి చర్చలు జరపాలి
* సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
కాకతీయ,చేర్యాల : దేశాలపై యుద్దాలు ఆపి ప్రపంచ శాంతి చర్చలు జరపాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ ఎర్రగుంట ప్రభాకర్ తెలిపారు. శాంతి కోసం ఫిబ్రవరి 22న కేఏ పాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెన్నై మహా పట్టణంలో వైఎంసీఏ నందనలో సమావేశం జరుగనుందని తెలిపారు. శుక్రవారం అంబెడ్కర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన సమావేశానికి సీపీఐ, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో యుద్ధాలు సమాధానం లేకపోవడం వల్ల ప్రేమ సంతోషము లేకపోవడం వల్ల ఆస్తి నష్టము ప్రాణ నష్టము దేశాలు నష్టపోవడం దాపరించడం వల్ల సరైన విధముగా ఉండాలంటే శాంతి ఉండాలి సమాధానం ఉండాలి కాబట్టి దానికోసం కె ఏ పాల్ ప్రపంచ దేశాలకు శాంతి కోసం చెన్నై పట్టణంలో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచ దేశాలను శాంతిని కోరడం ఐక్యతను కోరడం కోసం సాధ్యమవుతుందని మేధావులు ఆలోచన చేయాలన్నారు. ప్రపంచ దేశాలు శాంతి మార్గంలో నడవాలని జరిగిందని పాల్ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, వెలుగల శ్రీనివాస్, మల్లిగారి భూమయ్య, గుస్క రామదాస్, నంగి కనకయ్య, వీరయ్య, యాకుబు, పాల్సన్ రాజ్, దానియేలు, డానియల్,రాజు, తదితరులు పాల్గొన్నారు.


