ఖమ్మంలో ఘనంగా శివాజీ జయంతి
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 1 టౌన్ పరిధిలో గుర్రాలబొమ్మ సెంటర్ (ముస్తఫానగర్) వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ 1 టౌన్ అధ్యక్షుడు గడిల నరేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ 1630లో పూణేలో జన్మించిన శివాజీ మహారాజ్ 1674లో రాయిఘడ్‌లో ఛత్రపతిగా పట్టాభిషిక్తుడై ప్రజల పరిరక్షణకు కట్టుబడ్డారని తెలిపారు. పరమత సహనంతో అన్ని మతాలను గౌరవిస్తూ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. గడిల నరేష్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ మొఘలుల దండయాత్రలకు ఎదురొడ్డి దేశాన్ని కాపాడిన మహాయోధుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశం, ధర్మం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు, డోకూపర్తి రవీందర్, మందడపు ప్రభాకర్ రెడ్డి, పొట్టిమూతి జనార్దన్, బండారు శ్రీను, విజయరాజు, సురేష్ గౌడ్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు.


