నూతన కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఏఐటీయూసీ ఘన సన్మానం
– ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లను ఏఐటీయూసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్ అమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 7వ వార్డు కౌన్సిలర్ మన్నె విష్ణువర్ధన్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్, 9వ వార్డు కౌన్సిలర్ శేరుపల్లి ఉపేందర్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ యెల్దండి నరసింహారెడ్డి లకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ… ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సన్మాన కార్యక్రమం అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ కౌన్సిలర్ శివలింగ కృష్ణ, సంఘం నాయకులు చింతకింది స్వామి, కొండకింది పోచయ్య, కొండిరాజ్యం, అమాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


