పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) గా విధులు నిర్వహిస్తున్న ఈర్ల కృష్ణను పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ అధ్యక్షులు కట్టా శేఖర్ రావు నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ఎజెండా అని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డి.ఎ లను వెంటనే విడుదల చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షనును రద్దు చేయాలని, పి.ఆర్.సి ను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన ఈర్ల కృష్ణను అభినందిస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శిగా నియమితులైన ఈర్ల కృష్ణ మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతం ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, రాష్ట్ర బాధ్యులు సాదే వెంకన్న, సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, శోభన్ బాబు, సర్వర్మియా, ఉపాధ్యాయులు నరేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


